ఈ నెల 28న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
- October 26, 2023
తిరుమల: ఈ నెల 29న పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో 28న సాయంత్రం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. దాదాపు 8 గంటలపాటు ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రోజు శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు మరో రోజుకు వాయిదా వేసుకోవడం మేలు.
29న తెల్లవారుజామున 1.05 గంటలకు గ్రహణం మొదలై 2.22 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయ తలపులు మూసివేయడం ఆనవాయితీ కావడంతో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. 29న తెల్లవారుజామున ఏకాంతంలో ఆలయాన్ని శుద్ధిచేసి ఏకాంతసేవ నిర్వహిస్తారు. అనంతరం భక్తులను తిరిగి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







