శ్రీనిధి శెట్టి మళ్లీ వస్తుందహో.!

- October 26, 2023 , by Maagulf
శ్రీనిధి శెట్టి మళ్లీ వస్తుందహో.!

‘కేజీఎఫ్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. ఒక్క సినిమాతోనే ఎక్కడ లేని క్రేజ్ దక్కించుకుందీ అందాల భామ. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌కే ఆ టైమ్‌లో అమ్మడికి బోలెడన్ని అవకాశాలొచ్చాయట.

కానీ, ప్రశాంత్ నీల్‌తో వున్న కమిట్మెంట్‌.. కంటెంట్‌తో వున్న కనెక్టివిటీ.. ఇలా శ్రీనిధి శెట్టిని అంది వచ్చిన అవకాశాల్ని వదులుకునేలా చేశాయట. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడెనిమిది ప్రాజెక్టులు వదిలేసుకుందట శ్రీనిధి శెట్టి.

అప్పుడలా చేయాల్సి వచ్చింది. కానీ, అలా చేసినందుకు ఇప్పుడు బాధపడుతోందట. ‘కేజీఎఫ్’ తర్వాత ‘కోబ్రా’లో నటించింది శ్రీనిధి శెట్టి. కానీ, ఈ సినిమా రిజల్ట్ కాస్త అటూ ఇటూ అయ్యేసరికి పాపని పూర్తిగా మర్చిపోయారు సినీ జనం.

మళ్లీ ఇప్పుడే ఓ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదీ ఓ చిన్న హీరో సినిమా. ‘డీజె టిల్లు’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అన్నీ కలిసొస్తే.. ఈ సినిమా హిట్టయితే శ్రీనిధి శెట్టి మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయ్.

అన్నట్లు ఈ సినిమాలో రాశీఖన్నా ఇంకో హీరోయిన్‌గా నటిస్తుందండోయ్. రాశీఖన్నా ఆల్రెడీ తెలుగులో ఓ మోస్తరు స్టార్‌డమ్ వున్న హీరోయిన్. శ్రీనిధికి ‘కేజీఎఫ్’ స్టార్‌డమే చెప్పుకోదగ్గది. చూడాలి మరి. ఈ సినిమాతో కనుక శ్రీనిధి శెట్టి నిలదొక్కుకోగలిగితే.. తెలుగులో తిష్ట వేసేయడం పక్కా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com