విటమిన్ ‘బి’ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా.?

- October 26, 2023 , by Maagulf
విటమిన్ ‘బి’ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా.?

శరీరం ఆరోగ్యంగా వుండాలంటే విటమిన్లు చాలా అవసరం. శరీరంలో చాలా కీలకమైన పనులు చేస్తుంటాయ్ విటమిన్లు. ఆరోగ్యంగా వుండాలంటే తగినన్ని విటమిన్లు శరీరానికి అందాల్సిందే. ముఖ్యంగా విటమిన్ ‘బి’ అత్యంత కీలకమైన జీర్ణశయ అంతరాళానికి సంబంధించిన పనుల్లో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.

అందుకే శరీరానికి తగినంత ‘బి’ విటమిన్ అందాలని.. వైద్యులు సూచిస్తుంటారు. తీసుకునే ఆహారం ద్వారా విటమిన్ బి తగిన మోతాదులో అందకపోతే, బి కాంప్టెక్స్ సప్లిమెంట్స్ సూచిస్తుంటారు వైద్యులు.

అయితే, వైద్య సలహాలు లేకుండానే విటమిన్ బి కాంప్లెక్స్ విరివిగా వాడేస్తుంటారు కొందరు. అలా వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్టులు వస్తాయనీ, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అతిగా విటమిన్ బి కాంప్లెక్స్ వాడడం వల్ల శరీరంపై దద్దుర్లు, దురద వచ్చే అవకాశాలున్నాయ్. అలాగే, అజీర్తి, విరేచనాలు వాంతులు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మోకాళ్లలో తిమ్మిర్లు వేధిస్తుంటాయ్. ఎక్కువ సేపు నడిచినా, నిలబడినా ఈ తిమ్మిర్లు బాధిస్తుంటాయ్. నిద్రపై అధిక ప్రభావం పడుతుంది. తద్వారా ఒత్తిడికి లోనై చికాకు, కోపం వంటి అననుకూల ప్రభావాలకు గురవుతుంటారు. సో, విటమిన్ బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలని వైద్యుల సలహా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com