‘జియో స్పేస్ ఫైబర్’ విడుదల
- October 27, 2023
న్యూఢిల్లీ: భారతదేశ కుబేరుడు, రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్ కార్యక్రమం సందర్భంగా ఇది చోటు చేసుకుంది. దీన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రధానిని అభినందించారు.
‘‘ప్రతి తరానికి ఓ విజన్ అంటూ ఉండాలి. ఆ విజన్ ఎన్నింటికో ప్రోత్సాహంగా నిలవాలి. మీరు (ప్రధాని మోడీ) మా తరానికి మన దేేశాన్ని వికసిత భారత్ గా మార్చాలనే దృక్పధాన్ని కల్పించారు’’అని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ దేశంలో తొలి శాటిలైట్ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్ ‘జియో స్పేస్ ఫైబర్’ను విడుదల చేసింది. ఇది అధిక వేగంతో కూడిన బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందించేందుకు వీలు కల్పిస్తుంది.
దేశీయంగా రిలయన్స్ అభివృద్ధి చేసిన టెక్నాలజీ, ఉత్పత్తులను ప్రధాని మోడీకి ఆకాశ్ అంబానీ తెలియజేశారు. జియో స్పేస్ ఫైబర్ ద్వారా కొత్తగా లక్షలాది మందికి చేరువ అవుతామని ఆకాశ్ అంబానీ ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోడీ 100 5జీ ల్యాబ్ లను ప్రారంభించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







