వీధి వ్యాపారులకు జారీ చేసిన వర్క్ పర్మిట్‌లు రద్దు

- October 27, 2023 , by Maagulf
వీధి వ్యాపారులకు జారీ చేసిన వర్క్ పర్మిట్‌లు రద్దు

కువైట్: దేశంలో మార్జినల్ వర్కర్ల సంఖ్యను తగ్గించేందుకు, వీధి వ్యాపారులకు జారీ చేసిన వర్క్ పర్మిట్‌లను రద్దు చేసేందుకు సుప్రీం కమిటీ ఫర్ అడ్రస్సింగ్ డెమోగ్రాఫిక్స్ కసరత్తు చేస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ వీధి వ్యాపారులు ప్రభుత్వ సేవలకు భారంగా మారినట్లు అధికారులు గుర్తించారు. వీధి వ్యాపారులకు వర్క్ పర్మిట్‌లు వీసా వ్యాపారానికి గేట్‌వేగా మారిందని తెలిపారు.  అధికారిక వర్గాల ప్రకారం.. మ్యాన్‌పవర్ అథారిటీ జారీ చేసిన వర్క్ పర్మిట్‌లతో వేలాది మంది ప్రవాసులు ఈ వ్యాపారాలలో పనిచేస్తున్నారు. జనాభా చికిత్స కోసం సుప్రీం కమిటీ ఈ అనుమతుల రద్దును ఆమోదించినట్లయితే కనీసం 5,000 వర్క్ పర్మిట్‌లను రద్దు అవుతాయని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com