యూఏఈకి కొనసాగుతున్న ఆరెంజ్, ఎల్లో అలెర్ట్
- October 27, 2023
యూఏఈ: ఎమిరేట్స్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ ప్రకారం.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి, యూఏఈ అంతటా ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. NCM దేశంలోని చాలా ప్రాంతాలకు అరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. అబుదాబి, దుబాయ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అస్థిర వాతావరణం కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ బోర్డులపై ప్రదర్శించబడే మారుతున్న వేగ పరిమితులను అనుసరించాలని అబుదాబి పోలీసులు పిలుపునిచ్చారు.కోస్తా మరియు అంతర్గత ప్రాంతాలలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం వాతావరణం తేమగా ఉంటుంది, పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. అత్యల్ప ఉష్ణోగ్రత 19°Cకి పడిపోయేలా.. అంతర్గత ప్రాంతాల్లో అత్యధికంగా 37°Cకి చేరుకుంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్గా సజ్జనార్
- ఒమన్, కువైట్తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..