బాబోయ్ వింటర్.! డైట్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!

- October 27, 2023 , by Maagulf
బాబోయ్ వింటర్.! డైట్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!

వింటర్ వస్తుందంటే చాలు.. ఎక్కడ లేని బద్దకం ఆవహిస్తుంది. తద్వారా తెలియకుండానే శరీరం బరువులో మార్పులొచ్చేస్తాయ్. చలికి భయపడి.. ఉదయం పూట చేయాల్సిన వ్యాయామాల్ని సింపుల్‌గా స్కిప్ చేసేస్తుంటాం. ఆటెమెటిగ్గా బరువు పెరిగిపోతాం.
అందుకే వింటర్‌లో బరువును అదుపులో వుంచుకోవడమెలా.? ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం పూట వ్యాయామం చేయలేకపోతే, సాయంత్రం పూట వ్యాయామం చేయాలి. అది కూడా కుదరకపోతే, డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి.
ఈ సీజన్‌లో జంక్ ఫుడ్స్‌కి చాలా దూరంగా వుండాలి. వాటి ప్లేస్‌లో వేడి వేడి సూప్స్, రాగి మాల్ట్ వంటి చిరు ధాన్యాల సూప్స్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇవి ఫ్యాట్ బర్నర్స్‌గా పని చేస్తాయ్. వ్యాయామం చేయలేకపోయినా పెద్దగా బరువులో మార్పులుండవు.
వింటర్‌లో బరువు సమస్యతో పాటూ, కొన్ని జలుబు, వైరల్ జ్వరాల వంటి ఫ్లూ, ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలున్నాయ్. వాటినుంచి తప్పించుకోవడానికి  ముఖ్యంగా తీసుకునే ఫుడ్ ఐటెమ్ అల్లం. అల్లంలోని గుణాలు ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయ్.
అలాగే, ఈ సీజన్‌లో వేరుశెనగలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి ఆక్సిజన్ అందించే శాతాన్ని పెంచడంలో తోడ్పడుతుంది వేరుశెనగ. అందుకే ఏ రూపంలోనైనా వేరు శెనగలను తప్పకుండా తీసుకోవాలి వింటర్ సీజన్‌లో. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com