‘టిల్లు స్క్వేర్’ ఆలస్యానికి అదే కారణమా.?
- October 28, 2023
‘డీజె టిల్లు’ ఏ స్థాయిలో సూపర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోవిడ్ టైమ్‌లో వచ్చిన ఈ సినిమా వెల వెలబోతున్న బాక్సాఫీస్‌కి కళ తీసుకొచ్చిందనే చెప్పొచ్చు.
అయితే, ఈ సినిమాకి సీక్వెల్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఆగస్ట్‌లో రిలీజ్ కావల్సి వుంది రెండో టిల్లు. అదేనండీ ‘టిల్లు స్క్వేర్’. మొదటి పార్ట్‌కి మించిన మసాలా దట్టించి ఈ రెండో పార్ట్‌ని అత్యంత శక్తివంతంగా రూపొందించబోతున్నామని చిత్ర యూనిట్ మొదట్లోనే తెలిపింది.
విదేశాల్లో ఈ సినిమా ఎక్కువ పార్ట్ షూటింగ్ జరుపుకుంది. అంతా బాగానే వుంది కానీ, అంచనాలున్నప్పటికీ ఈ సినిమా రిలీజ్ ఎందుకో వాయిదాల పర్వంలో నడుస్తోంది. ఆగస్ట్ అన్నారు కాలేదు. సెప్టెంబర్, అక్టోబర్, పోనీ డిశంబర్.. అది కూడా కాదు.. ఇప్పుడు ఫిబ్రవరి అంటున్నారు.
ఈ రగడపై కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఇదేమీ గ్రాఫిక్స్ సినిమా కాదు. సీజీ వర్క్ కారణంగా లేటవుతోందనుకోవడానికి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం సినిమా అవుట్ పుట్‌పై యూనిట్ అసంతృప్తికరంగా వుందట. అందుకే సన్నివేశాలు రీషూట్ జరుగుతోందట.
ఈ ఆలస్యానికి కారణం ఆ రీషూట్సే అని తెలుస్తోంది. అంతేకాదు, కథలోనూ కొన్ని కీలకమైన మార్పులు చేశారట. చూడాలి మరి, లేట్ అయినా లేటెస్ట్‌గా వచ్చి రెండో టిల్లుగాడు బాక్సాఫీస్ బద్దలు కొడతాడో లేదో.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







