మెగాస్టార్ 156 స్టోరీ అదేనట.!
- October 28, 2023
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 156వ చిత్రం రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్‌తో ఈ సినిమా లేటెస్ట్‌గా స్టార్ట్ అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
కాగా, ఈ సినిమా కథ ఇలా వుండబోతోందట.. అలా వుండబోతోందట.. అంటూ తాజాగా సోషల్ మీడియాలో కథనాలు వండి వడ్డించేస్తున్నారు నెటిజనులు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఈ సినిమా కాన్సెప్ట్ ప్యాంటసీ తరహాలో వుంటుందని హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ వశిష్ట.
ఫ్యాంటసీ అంటే గ్రాఫిక్స్‌కి పెద్ద పీట వేస్తారు. ఆ యాంగిల్‌లోనే ఈ సినిమా కథ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తరహాలో వుండబోతోందట అని కొందరు ప్రచారం చేస్తుంటే.. కాదు కాదు, ‘అంజి’ తరహాలో అద్భుతమైన గ్రాఫిక్స్ వుండబోతున్నాయట అని ఇంకొందరు అంటున్నారు.
మూడు కాలాల నేపథ్యంలో సినిమా స్టోరీ నడుస్తుందని లీక్ అయితే వచ్చేసింది. అలాగే, ‘విశ్వంభర’ అనే టైటిల్ కూడా ప్రచారం వుంది. అసలు విషయం ఏంటో కానీ, మొత్తానికి ఈ సినిమా అయితే, మెగా అభిమానుల్లో పిచ్చ పిచ్చగా క్రేజ్ నింపుతోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







