మాస్ రాజాకి ఫిక్సయిన బేబమ్మ.! నిజమేనా.?

- October 28, 2023 , by Maagulf
మాస్ రాజాకి ఫిక్సయిన బేబమ్మ.! నిజమేనా.?

‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ర్టీకి పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి. తొలి సినిమా విజయంతో తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంది. అతి తక్కువ టైమ్‌లోనే బోలెడన్ని సినిమాలు చేసేసింది. అయితే, ఇటీవల వరుస ఫ్లాపులు రావడంతో రేస్ నుంచి వెనక్కి తప్పుకుంది బేబమ్మ క‌ృతి శెట్టి.

ప్రస్తుతం ఆమె చేతిలో శర్వానంద్ చిత్రమొక్కటే వుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అదలా వుంటే, తాజాగా మాస్ రాజా సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇటీవలే స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా మొదట రష్మిక పేరు వినిపించింది. తాజాగా కృతి శెట్టి పేరు తెరపైకి వచ్చింది.

ఈ మధ్య రవితేజ కొత్త భామలను లైన్‌లో పెడుతూ ఆయా ముద్దుగుమ్మలకి స్టార్ స్టేటస్ ఇచ్చే పనిలో బిజీగా వున్నాడు. శ్రీలీల కెరీర్ కూడా అలాగే టర్న్ అయ్యింది. అలాగే ఫేమ్‌లో లేని ముద్దుగుమ్మల్ని కూడా ట్రాక్ ఎక్కించడంలో ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్ వుంది మాస్ రాజాకి.

అలా, ఐరెన్ లెగ్ అని ముద్ర వేయించుకుని రేస్‌లో వెనకబడిపోయిన కృతి శెట్టికి మాస్ రాజా పుణ్యమా అని లక్కు తిరిగొస్తుందేమో చూడాలిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com