ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ

- October 29, 2023 , by Maagulf
ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ

అమరావతి: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్నాయి. కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ రైలు ఢీకొట్టింది. దీంతో పలాస ప్యాసింజర్ 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఘటనా స్థలంలో కరెంట్ లేకపోవడంతో భీతావాహ పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు.

” సాంతికేతిక లోపంతో ఆగి ఉన్న ప్యాసింజర్ ను మరో రైలు ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే సహాయక బృందాలు ఘటనాస్థలికి బయలుదేరాయి” అని రైల్వే అధికారులు తెలిపారు.

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జగన్.

విశాఖ రైల్వేస్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు..
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జగన్. మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.

హెల్ప్ లైన్ నెంబర్స్
0891 2746330
0891 2744619
81060 53051
81060 53052
85000 41670
85000 41671

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com