శ్రీవారి భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు
- October 29, 2023
తిరుమల: టీటీడీ ముద్రించిన 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో భక్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా http://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్ టాప్ క్యాలెండర్లను భక్తులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ధరల వివరాలు ప్రకటించింది. 12 పేజీల క్యాలెండర్ ధర రూ.130, టేబుల్ టాప్ క్యాలెండర్ ధర రూ.75, 6 పేజీల క్యాలెండర్ రూ. 450 లు గా నిర్ధారించింది. శ్రీ వేంకటేశ్వరస్వామి పెద్ద క్యాలెండర్ రూ.20లకు, తెలుగు పంచాంగం క్యాలెండర్ ధర 30 రూపాయలు గా నిర్ణయించి అమ్మకాలను ప్రారంభించింది. తిరుపతి, తిరుమల లోనే కాకుండా బయటి ప్రాంతాల్లో అమ్మకాలు చేపడుతోంది. చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







