ఐదు నక్షత్రాల హోటల్లోచంద్రబాబు నాయుడు కుటుంబ మకాం...
- May 23, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ మకాం ఐదు నక్షత్రాల హోటల్‌కు మారింది. అందులోనే సుమారు మూడు నెలలపాటు వారు ఉండనున్నారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8న బాధ్యతలు చేపట్టిన తరువాత మారిన ఇళ్ల జాబితాలో ఇది మూడోది. మదీనగూడలోని ఫాంహౌస్‌లో చంద్రబాబు కుటుంబం ప్రస్తుతం ఉంటోంది. తాజాగా ఆయన కుటుంబం బంజారాహిల్స్ రోడ్డు నంబరు2 లోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పొరుగునే ఉన్న ఐదు నక్షత్రాల హోటల్ పార్క్ హయత్‌కు మారింది.దేశంలోనే ఒక ముఖ్యమంత్రి కుటుంబం ఓ హోటల్లో మకాం ఉండటం ఇదే తొలిసారి అని రాజకీయ వర్గాలంటున్నాయి. చంద్రబాబు తొలినుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 65లోని సొంత ఇంట్లో ఉండేవారు. కానీ తర్వాత వాస్తు కారణాలతో ఆ ఇంటిని కూలదోసి కొత్త ఇల్లు నిర్మించాలని భావించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ఇంటి నిర్మాణం ప్రస్తుతం తుదిదశలో ఉంది. ఆ ఇంటిని సర్వహంగులతో నిర్మించేందుకు కూలదోసిన సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 24లోని ఓ ఇంటిలో అద్దెకు దిగారు. అక్కడ కొద్దిరోజులు ఉన్న ఆయన ఆ తరువాత తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న లేక్‌వ్యూ అతిథి గృహంలో ఉండేందుకు సిద్ధపడ్డారు. కుటుంబసభ్యులు దానిని పరిశీలించారు. అయితే వారు మనస్సు మార్చుకుని మదీనగూడలోని సొంత ఫాంహౌస్‌కు మారారు.తాజాగా అక్కడి నుంచి ఐదు నక్షత్రాల హోటల్‌కు మారారు. సొంత ఇంటి నుంచి స్టార్ హోటల్‌కు మారే వరకు ఆయన ఉన్న నివాసాలు, కార్యాలయాల మరమ్మతుల నిమిత్తం సుమారు రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారవర్గాల సమాచారం. వీటి మరమ్మత్తులు, భద్రతా ఏర్పాట్లకే ఈ మొత్తంలో సింహభాగం ఖర్చు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం ఉండే హోటల్ అద్దె అందులో ఉన్న సౌకర్యాలు, విస్తీర్ణం బట్టి రోజుకు రూ. 17 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉంటుంది. అదే నెలకు అయితే వాటి విస్తీర్ణాన్ని బట్టి రూ. 3.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షల వరకూ హోటల్ వసూలు చేస్తుంది. వీటికి పన్నులు అదనం. సీఎం కుటుంబం ఎక్కడ నివాసం ఉన్నా వారికి అయ్యే ఖర్చు, అద్దెను ప్రభుత్వమే భరిస్తుంది.ప్రస్తుతం సీఎం చంద్రబాబు తాత్కాలికంగా నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని లింగమనేని ఎస్టేట్స్‌కు రోడ్ల నిర్మాణం, ఇతర అవసరాల నిమిత్తం రూ. 10 కోట్లకు పైగా ఖర్చుచేశారు. హైదరాబాద్‌లోని మదీనాగూడ, తాడేపల్లిలో గృహాలను నివాస, క్యాంపు కార్యాలయాలుగా ఉపయోగిస్తున్నారు. వీటిలో ప్రస్తుతం, భవిష్యత్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్నంతవరకూ ఏ చిన్న మార్పులు చేసినా ప్రభుత్వమే ఖర్చు భరించాల్సి ఉంటుంది
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









