నవంబర్‌లో పెరుగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
- October 31, 2023
యూఏఈ: యూఏఈ ఇంధన ధరల కమిటీ మంగళవారం నవంబర్ నెలకు సంబంధించి సవరించిన రిటైల్ పెట్రోల్ మరియు డీజిల్ రేట్లను గ్లోబల్ రేట్లను ప్రకటించనుంది. ముడిచమురుకు అధిక డిమాండ్‌తో అంతర్జాతీయంగా పెరిగిన ధరల కారణంగా యూఏఈ వరుసగా నాలుగు నెలలుగా పెట్రోల్ ధరలను పెంచుతూ వస్తుంది. అక్టోబర్‌లో రిటైల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం, సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్ దిర్హామ్ 3.44, స్పెషల్ 95 ధర లీటరుకు 3.33 దిర్హామ్ మరియు ఇ-ప్లస్ ధర 3.26 దిర్హాం. డీజిల్ ధర లీటరు 3.57 దిర్హాంలుగా ఉన్నాయి. 2015 నుండి యూఏఈ స్థానిక రిటైల్ ఇంధన ధరలను గ్లోబల్ రేట్ల ఆధారంగా నిర్ణయించడం ప్రారంభించింది. ప్రపంచ ధరలకు అనుగుణంగా ప్రతి నెలాఖరులో ధరలు సవరిస్తున్నారు. అయితే, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనియన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో అక్టోబర్‌లో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. అక్టోబరులో బ్రెంట్ ధర మొదటి వారంలో $90.9 నుండి $84 మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. అక్టోబర్ 19న $92.38కి ఎగబాకి, అక్టోబర్ 30న మధ్యాహ్న సమయానికి బ్యారెల్ $89.54 వద్ద కొద్దిగా తగ్గింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







