చంద్రబాబుకు బెయిల్ ..కండిషన్స్ ఇవే !!
- October 31, 2023
స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో గత 53 రోజులుగా జ్యుడీషియల్ రిమాండ్ లో ఆయనకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో చంద్రబాబు బెయిల్ కోరగా.. విచారించిన హైకోర్టు 4 వారాలు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీంతో ఎట్టకేలకు చంద్రబాబు జైలు నుండి బయటకు రానున్నారు. అయితే.. బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు చంద్రబాబుకు ఐదు కండీషన్లు పెట్టింది.
షరతులు:-
1) పిటిషనర్ చంద్రబాబు లక్ష రూపాయల పూచీకత్తుతో 2 షూరిటీలు ట్రయల్ కోర్టు ఎదుట సమర్పించాలని ఆదేశించింది.
2) చంద్రబాబు తన ఖర్చులతో తనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చు.
3) చంద్రబాబు ఏ ఆస్పత్రిలో చిక్సిత పొందారో.. ఆయనకు ఏ చిక్సిత అందించారో పూర్తి వివరాలను సీల్డ్ కవర్‌లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కి లొంగిపోయే సమయంలో అందజేయాలి.
4) పిటిషనర్ చంద్రబాబు ప్రత్యక్షంగానీ లేదా పరోక్షంగానీ కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తితో మాట్లాడకుండదు. వారిని ఎటువంటి ప్రేరేపణ, బెదిరింపు చేయకూడదు. రాజకీయ సమావేశాల్లో కానీ, నేతలతో భేటీలో కానీ పాల్గొనవద్దని తెలిపింది
5)చికిత్స అనంతరం నవంబర్ 28, 2023న సాయంత్రం 5 గంటలలోపు చంద్రబాబు తనంతట తాను రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.
కాగా.. చంద్రబాబు విడుదలకు సంబంధించిన డ్యాకుమెంటరీ వర్క్ అంతా ఈ రోజు మధ్యాహ్నాం పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని సక్రమంగా సాగుతే.. చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







