అబ్బో.! నితిన్ చాలానే ‘ఎక్స్ట్రా’లు చేశాడుగా.!
- October 31, 2023
నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్ట్రా’. ‘ఆర్డినరీ మేన్’ అని క్యాప్షన్ వుంది. అయితే, క్యాప్షన్నీ టైటిల్‌నీ విడి విడిగా చదవొద్దనీ కలిపి ‘ఎక్స్ట్రార్డినరీ మేన్’ అని చదవాలని నితిన్ చెబుతున్నాడు.
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్లో నితిన్ మార్క్ ఎంటర్టైన్మెంట్ బాగా కనిపిస్తోంది. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించబోతున్నాడన్న హింట్ ఎప్పుడో అందిందనుకోండి. టీజర్లో అది బాగానే హైలైట్ చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ పేరు చెప్పి, ప్రభాస్ ని బాగా వాడేశాడు నితిన్.
ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ప్రభావం తన సినిమాలపై వుంటుంది. అయితే, ఈ సారి కొంచెం కొత్తగా ప్రభాస్ ని తన వాడకానికి వాడేసుకున్నాడు నితిన్. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాలో ఆరో వరుసలో ఏడో మనిషి.. డైలాగ్ బాగా పేలింది.
టీజర్ చూస్తుంటే, సినిమా ఆధ్యంతం నవ్వులు పూయించేలానే అనిపిస్తోంది. హా.! అన్నట్లు త్రివిక్రమ్ మార్క్ కూడా అక్కడక్కడా వాడేశాడండోయ్. మొత్తానికి ‘ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్’ నితిన్‌కి హిట్టు కళ తెచ్చే సినిమాలానే అనిపిస్తోంది. శ్రీలీల ఈ సినిమాకి మరో మెయిన్ అస్సెట్. చూడాలి మరి ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







