సంక్రాంతి బరిలో ‘సైంధవ్’.!
- October 31, 2023
సైలెంట్‌గా సంక్రాంతి బరిలో జాయిన్ అయిపోయాడు ‘సైంధవ్’గా విక్టరీ వెంకటేష్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘సైంధవ్’ చిత్రాన్ని శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. ‘హిట్’ సిరీస్ మూవీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు శైలేష్ కొలను. విక్టరీ వెంకటేష్‌తో ‘సైంధవ్’ అనే భీభత్సమైన యాక్షన్ డ్రామాతో ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి చిన్న యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. తనదైన పర్ఫామెన్స్తో, సీనియారిటీతో తన పాత్రకు హుందాతనంతో కూడిన పెద్దరికాన్ని ఆపాదించాడు విక్టరీ వెంకటేష్.
సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది చాలానే సినిమాలు బరిలో వున్నాయ్. తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతికి తన సినిమాని దించుతుండడంతో వెంకీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
జనవరి 13న ‘సైంధవ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్నట్లు ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాళ్లే శ్రద్ధా శ్రీనాధ్, రుహానీ శర్మ, ఆండ్రియా.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







