బిగ్‌బాస్ మహారాణులు.! ‘రాణీగిరి’ అంటే ఏంటో కాస్త నేర్పించండ్రా.!
- October 31, 2023
బిగ్‌బాస్ హౌస్‌లోని అమ్మాయిల్ని మహారాణుల్లా చూసుకోవాలంటూ తాజాగా బిగ్‌బాస్, హౌస్‌లోని మేల్ కంటెస్టెంట్లకు టాస్క్ విధించాడు. ఓకే.! నిజంగానే ఇది ఓ ఫన్నీ టాస్క్.
ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడమే ఈ టాస్క్ యొక్క ముఖ్య వుద్దేశ్యం. అయితే, మరీ ‘రాణీగిరీ’ అంటే ఎంత పడితే అంత తినడమేనా.? అదీ మగవాళ్లతో తినిపించుకోవడమా.?
ఆ పేరు చెప్పి రతిక ఏడెనిమిది అరటి పండ్లు ఫటా ఫట్ లాగించేసింది ఒక్కటేసారి. శోభా శెట్టి అయితే, తేజతో ఏకంగా బ్రష్ చేయించుకుని ఫ్రూట్ జ్యూస్‌లు గట్రా చేయించుకుని తినేసింది. ఇక, ప్రియాంక ఓవరాక్షన్ అయితే చెప్పనేలేం. మిగిలిన ఫిమేల్ కంటెస్టెంట్ అశ్వని జస్ట్ ఓకే. భోలేతో పులిహోర కలిపే ప్రయత్నంలో బిజీగా వుండిపోయింది.
మహారాణుల్లా చూసుకోవడం అనే ప్యాటర్న్ టాస్క్ గత సీజన్లలోనూ వుంది. అయితే, ఈ సీజన్లో ఈ టాస్క్ పిచ్చ బోరింగ్‌గా వుందంటూ బిగ్‌బాస్ వీక్షకులు వెక్కిరిస్తున్నారు.
అసలే వున్నదే నలుగురు అమ్మాయిలు హౌస్‌లో. అదే బోరింగ్ అంటే.. ఇక రాణి టాస్క్‌లో వీళ్లు చేస్తున్న ఓవరాక్షన్‌కి అబ్బో.! అబ్బబ్బో.! మీకేం తెలుస్తాయ్లెండి బిగ్‌బాస్ వీక్షకుల కష్టాలు.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







