రెండు పార్టులుగా ‘ఇండియన్ 2’.! ఇదేం ట్విస్ట్ శంకరా.!

- October 31, 2023 , by Maagulf
రెండు పార్టులుగా ‘ఇండియన్ 2’.! ఇదేం ట్విస్ట్ శంకరా.!

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్‌గా ఓ అప్‌డేట్ తెర పైకి వచ్చింది. సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నారట.

అదేంటీ.! ఇదే సీక్వెల్ సినిమా. దీన్ని మళ్లీ రెండు పార్టులా.? అసలింతకీ సినిమా షూటింగ్ పూర్తయ్యిందా.? లేదా.? ఎప్పుడో పూర్తయిపోయిందన్నారు. ఈ సినిమా కోసమే చరణ్ ‘గేమ్ ఛేంజర్’ని కూడా పక్కన పెట్టాడు డైరెక్టర్ శంకర్.

రేపో మాపో రిలీజ్ డేట్ ప్రకటిస్తాడనుకుంటే ఇప్పుడేమో రెండు పార్టులు అంటున్నాడేంటీ.? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. సరే, రెండు పార్టులు.. అంటే ఆల్రెడీ షూట్ చేసిన పార్ట్‌నే రెండు భాగాలుగా రిలీజ్ చేస్తాడా.? లేదంటే, ఇంకా షూటింగ్ ఏదైనా పెండింగ్ వుందా.? ఇలాంటి అనేక రకాల డౌటానుమానాలు ఈ సినిమాపై.

ఇదిలా వుంటే, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’పైనా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. అలాగే, కమల్ హాసన్ అభిమానులు కూడా.

లేటెస్ట్ ట్విస్ట్‌తో అభిమానుల్లో చెలరేగిన అనుమానాలు తీరాలంటే శంకర్ కానీ, కమల్ హాసన్ కానీ రెస్పాండ్ అవ్వాల్సి వుంది.

మరోవైపు కమల్ హాసన్, ప్రబాస్ ‘కల్కి’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com