గాజా కాల్పుల విరమణను తిరస్కరించిన ఇజ్రాయెల్
- October 31, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ యుద్ధంలో కాల్పుల విరమణను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. మరోవైపు గాజాలో అడుగుపెట్టిన ఇజ్రాయెల్ బలగాలు ఓ బందీని విడిపించినట్లు ప్రకటించాయి. "కాల్పు విరమణ కోసం పిలుపు అంటే ఇజ్రాయెల్ హమాస్‌కు లొంగిపోవాలని, ఉగ్రవాదానికి లొంగిపోవాలని పిలుపునిస్తున్నాయి" అని నెతన్యాహు అన్నారు. ఈ యుద్ధం గెలిచే వరకు పోరాటం ఆగదని ఆయన పేర్కొన్నారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్ దాడులు చేసింది. ఇందులో 1,400 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. అనంతరం 230 మందికి పైగా ప్రజలను బందీలుగా చేసుకొని వారిని గాజాకు తరలించింది హమాస్. ఆ తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ అప్పటి నుండి హమాస్ పాలనలో ఉన్న గాజాపై భారీ వైమానిక బాంబు దాడులను చేపడుతుంది. తాజాగా ఇజ్రాయెల్ బలగాలు గాజాలోకి ప్రవేశించాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి మానవతావాద సంధి కోసం పదేపదే పిలుపునిస్తుంది. గాజాలో హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ 8,000 మందికి పైగా మరణించినట్లు పేర్కొంది. వారిలో చాలా మంది పిల్లలు ఉన్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్‌కోచ్‌లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!









