ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు

- November 01, 2023 , by Maagulf
ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు

విజయవాడ: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ ద్వారా జైలు నుండి విడుదలైన చంద్రబాబు..ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. రాజమండ్రి నుండి రోడ్డు మార్గాన ప్రయాణం చేసిన బాబు..ఈరోజు ఉదయం 6 గంటకు నివాసానికి చేరుకున్నారు.

నిర్విరామంగా సుదీర్ఘ ప్రయాణంతో ఆయన అలసిపోయారు. దారి పొడవునా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అర్థరాత్రి వేళ, తెల్లవారు జామున సైతం వేల సంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు. ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మహిళలు పెద్దఎత్తున ఇంటివద్దకు చేరుకుని గుమ్మడికాయలతో దిష్టితీస్తూ అధినేతకు నీరాజనాలు పలికారు. విజయవాడ పశ్చిమ జనసేన ఇంచార్జ్ పోతిన మహేష్ నేతృత్వంలో పెద్దఎత్తున జనసేన కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌కు ఎదురేగి స్వాగతించారు. సంఘీభావంగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com