‘ఈగల్’ సంక్రాంతికి పక్కా.! తూచ్.! అంతా వుత్తదేనా.?
- November 01, 2023
మాస్ రాజా రవితేజకు ‘వాల్తేర్ వీరయ్య’ తర్వాత మంచి హిట్ తగల్లేదు. లేటెస్ట్‌గా ‘టైగర్ నాగేశ్వరరావు’తో ప్రేక్షకులను పలకరించినా.. రేస్‌లో ముందుకు సాగలేకపోయాడు. ఆశించిన రిజల్ట్ అందించలేకపోయింది మాస్ రాజాకి ‘టైగర్’. అయితే ఇప్పుడు ‘ఈగల్’ అంటూ వస్తున్నాడు.
సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. అయితే, ‘ఈగల్’ కి అంత సీను లేదు. సంక్రాంతికి రావడం కష్టమే.. అంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. తూచ్.! అవన్నీ గాలి వార్తలే.. కావాలంటే రిలీజ్ అయ్యే ధియేటర్ల అగ్రిమెంట్ ఫ్రూఫ్స్ చూపించాలా.! అంటూ చిత్ర యూనిట్ గుస్సా అవుతోంది.
సో, ఎలాగైనా సరే, సంక్రాంతికి ‘ఈగల్’ రావడం పక్కా అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిందన్న మాట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. జనవరి 13న ధియేటర్లలో ‘ఈగల్’ ఫ్లై అవ్వడం పక్కా అని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నాడు. అలాగే హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ చూపింబోతున్నారట. అనుపమా పరమేశ్వరన్, కావ్య థాపర్ ఈ సినిమాలో మాస్ రాజాతో జోడీ కడుతున్నారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







