ప్రమోషన్లు షురూ చేసిన ‘హాయ్ నాన్న’.!

- November 01, 2023 , by Maagulf
ప్రమోషన్లు షురూ చేసిన ‘హాయ్ నాన్న’.!

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న’. డిశంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ లోగా సినిమా ప్రమోషన్లు షురూ చేశారు చిత్ర యూనిట్. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషన్ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయ్.

తండ్రీ కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందన్న హింట్ కూడా ఆల్రెడీ అందేసింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శృతి హాసన్ గెస్ట్ రోల్ పోషిస్తోంది ఈ సినిమాలో.

తాజాగా ‘అమ్మాడి..’ అంటూ సాగే లిరికల్ సాంగ్ శాంపిల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకి సంబంధించి ఫుల్ లిరికల్ వీడియో ఈ నెల 4న రిలీజ్ కానుంది.

కాగా, నాని ఇటీవలే ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దూకుడు మీదున్నాడు. ‘దసరా’కి పూర్తి భిన్నమైన కాన్సెప్ట్‌తో ‘హాయ్ నాన్న’గా రాబోతున్నాడు.

ఈ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్‌లో నాని కనిపిస్తున్నాడు. ‘అమ్మాడి..’ వీడియోలో మృణాల్ ఠాకూర్, నాని మధ్య క్యూట్ అండ్ జాయ్ ఫుల్ సన్నివేశాలు కట్ చేశారు. శాంపిల్ వీడియోలోనే ఇంత క్యూట్‌గా కనిపించింది ఈ జంట. ఇక, ఫుల్ సాంగ్ వీడియోలో ఇంకెలా వుండబోతోందో చూడాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com