జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ

- November 01, 2023 , by Maagulf
జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ

యూఏఈ: గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు వందలాది మంది మరణాలకు కారణమైంది. ఇందులో వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీవ్రంగా ఖండించింది. విచక్షణారహిత దాడులు ఈ ప్రాంతంలో కోలుకోలేని పరిణామాలకు దారితీస్తాయని చెప్పింది. ఈ మేరకు యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ మానవతా చట్టం, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం పౌరులను రక్షించడం ప్రాముఖ్యతను అందులో తెలిపింది. ప్రాణనష్టాన్ని నివారించడానికి తక్షణ కాల్పుల విరమణ పాటించాలని కోరింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com