షార్జా మునిసిపాలిటీ ఇంకా స్మార్ట్‌గా
- May 24, 2016
షార్జా మునిసిపాలిటీ, ఇన్‌స్పెక్షన్ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ సర్వీసెసస్ బిల్డింగ్ సోమవారం ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రారంభమైంది. ఈ కొత్త బిల్డింగ్ 2,800 మీటర్ల వైశాల్యంలో ఉంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఇందులో వినియోగించారు. మున్సిపల్ కైరిఔన్సిల్ ఛైర్మన్ రషీద్ బిన్ తలైహా, షార్జా మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అయ్లాన్ ఈ భవనాన్ని ప్రారంభించారు. మునిసిపాలిటీ సాధించిన విజయాలకు ప్రతీకగా ఈ భవనాన్ని నిర్మించామని రియాద్ అల్ ఎలాన్ చెప్పారు. షార్జా మునిసిపాలిటీ ప్రజలకు అందిస్తున్న సేవల్ని ఇంకా మెరుగ్గా, స్మార్ట్‌గా మార్చడానికి ప్రయత్నిస్తోందని అన్నారాయన. వినియోగదారుల, ప్రజల విలువైన సమయాన్ని తగ్గించేందుకు మునిసిపాలిటీ టెక్నాలజీని సమర్థవంతంగా వాడుతోందని అధికారులు చెప్పారు. మునిసిపాలిటీ అధికారిక వెబ్‌సైట్‌ని అప్‌గ్రేడ్ చేసిన అనంతరం దాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అప్‌గ్రేడ్ చేయబడిన వెర్షన్, పబ్లిక్‌తో మరింత మెరుగైన కమ్యూనికేషన్‌ని కలిగి ఉంటుందని చెప్పారు. పర్మిషన్లు, లైసెన్సులను ఎలక్ట్రానిక్ పద్దతిలో మంజూరు చేయడానికి ఈ వెబ్‌సైట్ ఉపయుక్తంగా ఉంటుంది. ఇన్‌స్పెక్షన్ ఆపరేషన్ డైరెక్టర్ ఒమర్ అల్ షర్జి మాట్లాడుతూ, కొత్త బిల్డింగ్‌లో 71 సర్వీసులు అందుబాటులో ఉంటాయనీ, టెనెన్సీ రెగ్యులేషన్ డిపార్ట్‌మెంట్, పార్కింగ్ డిపార్ట్‌మెంట్, ఇన్‌స్పెక్షన్ ఆపరేషన్ మరియు ఇతర డిపార్ట్‌మెంట్లు ఇందులో కొలువుదీరాయని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







