నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బ్రిటన్ పార్లమెంట్‌ను సందర్శించారు..
- May 24, 2016
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా బ్రిటన్‌లోని లండన్ నగరాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం భారత సంతతికి చెందిన ఎంపీ, అఖిల పక్ష ఇండో-బ్రిటన్ ఎంపీల చైర్మన్ వీరేంద్ర శర్మ ఆహ్వానం మేరకు పార్లమెంట్‌ను సందర్శించారు.పార్లమెంటులోని వివిధ విభాగాలను చూపించి, వాటి చరిత్ర గురించి శర్మ వివరించారు. ఎమ్మెల్యే గణేశ్ బిగాల కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ గురించి, రాష్ట్రం సాధించిన విజయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వీరేంద్ర శర్మను తెలంగాణాకు రావాల్సిందిగా ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్శనలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు మహేశ్ బిగాలా, ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, తెలంగాణ ఎన్నారైఫోరం-హెడ్ ఆఫ్ అడ్వైసరీ బోర్డు ఉదయ్ నాగరాజు, ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ సెక్రటరీ నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







