విశ్వక్‌సేన్‌ని ఇబ్బంది పెడుతున్నదెవరు.?
- November 02, 2023
విశ్వక్ సేన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిన్న హీరోనే అయినా సెన్సేషనల్ హీరో. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వుందీ హీరోకి. తన ప్రతి సినిమాకీ ఏదో ఒక రకంగా కాంట్రవర్సీలు క్రియేట్ చేసి పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంటాడు విశ్వక్ సేన్.
అలాగే, తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కీ ఓ చిన్న గేమ్ ప్లాన్ చేసినట్లున్నాడు. తగ్గేకొద్దీ తొక్కేయాలని అనుకుంటారు.. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే.. అంటూ పలు రకాల అర్ధాలు వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు విశ్వక్‌సేన్.
డిశంబర్ 8న శివాలెత్తిపోద్ది. డిశంబర్‌లో కనుక నా సినిమా రిలీజ్ కాకపోతే.. ఇకపై నన్ను ప్రమోషన్లలో కూడా చూడరు.. అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు విశ్వక్ సేన్.
ఇదీ విశ్వక్ సేన్ స్టైల్ ఆఫ్ పబ్లిసిటీ. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తనదైన రూట్‌లో ఈ సినిమా కోసం చేసిన ఈ తాజా పబ్లిసిటీ విశ్వక్ సేన్‌కి వర్కవుట్ అవుతుందా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







