దీపావళికి ‘జపాన్’ దద్దరిల్లిపోద్ది.!

- November 02, 2023 , by Maagulf
దీపావళికి ‘జపాన్’ దద్దరిల్లిపోద్ది.!

కార్తి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జపాన్ - మేడ్ ఇన్ ఇండియా’ దీపావళి రేస్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై మొదట్నుంచీ అంచనాలు భారీగా వున్నాయ్. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ‘జపాన్’ ట్రైలర్‌తో ఆ అంచనాలు ఆకాశాన్ని అంటేశాయ్.

గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇక, కార్తీ నటనే ఈ సినిమాకి మెయిన్ హైలైట్. ఆధ్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌గా నడుస్తూ.. కార్తీ చేసే సాహసాలు.. ఈ సినిమాలో చూడబోతున్నాం.

అలాగే, డిఫరెంట్ మ్యానరిజమ్స్‌తో కార్తి పర్‌ఫామెన్స్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. సినిమా మేకింగ్ వేల్యూస్ కూడా చాలా చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయ్.

దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన‌గా నటిస్తోంది. సునీల్ ఓ ఇంపార్టెంట్ ‌రోల్‌లో కనిపిస్తున్నాడు.

కార్తి మంచి నటుడు. సీరియస్ రోల్ అయినా, కామెడీ రోల్ అయినా సరే ఇట్టే సెట్ అయిపోతుంటాడు. తనదైన నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంటాడు. ‘ఖైదీ’ తదతర సినిమాల్లో సీరియస్ లుక్స్‌లో కనిపించి మెప్పించిన కార్తి ఇప్పుడు ‘జపాన్’గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచబోతున్నాడు. దీపావళికి వేరే ఇతర పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో, కార్తికి అది కలసొస్తుందేమో చూడాలిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com