విశాఖపట్నం షిఫ్ట్ అయ్యేందుకు చకచకా ఏర్పాట్లు..

- November 02, 2023 , by Maagulf
విశాఖపట్నం షిఫ్ట్ అయ్యేందుకు చకచకా ఏర్పాట్లు..

విశాఖపట్నం: సీఎంఓ ఆఫీస్ విశాఖపట్నం షిఫ్ట్ అవ్వడానికి చకచకా పనులు జరిగిపోతున్నాయి. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, సీఎం క్యాంప్ ఆఫీస్, సీఎం నివాసం ఇలా.. అన్ని విషయాలపై సీఎం జగన్ పర్యవేక్షణలో కమిటీ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి విధానంలో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విశాఖలో ముఖ్యమంత్రి పర్యవేక్షణ, సమీక్ష సమావేశాలకోసం అవసరమైన భవనాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులు సహా, ఇతర అధికారులు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అవసరమైన భవనాలను గుర్తించామని ఈ సందర్భంగా అధికారుల కమిటీ తెలియజేసింది. దీంతోపాటు విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసుకోసం గుర్తించిన వివిధ భవనాల వివరాలను అధికారులు అందించారు.

విశాఖలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాలు, వాటి కార్యాలయాలు 2,27,287 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్నాయని కమిటీ గుర్తించింది. వీటిలో సీనియర్‌ అధికారులకు అవసరమైన క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని, వసతి కూడా ఆయా విభాగాల పరిధిలో ఉన్నవాటిని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఐటీ హిల్‌పై ఉన్న మిలీనియం టవర్‌లో అందుబాటులో ఉన్న 1,75,516 అడుగుల విస్తీర్ణంలో మిగిలిన సీనియర్‌ అధికారులు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడించింది. ఇంకా కొంతమంది అధికారులకోసం, వారి కార్యాలయాల కోసం మరికొన్ని ప్రైవేటు భవనాలను గుర్తించామని, 3,98,600 చదరపు అడుగులు విస్తీర్ణాన్ని గుర్తించామని కమిటీ వివరించింది.

ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులు కార్యలాపాలు, వారి వసతి కోసం ప్రభుత్వం భవనాలు, ప్రైవేటు భనాల్లో 8,01,403 చదరపు అడుగులు విస్తీర్ణాన్ని గుర్తించామని కమిటీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి తెలిపింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, వసతి కోసం ఐదు రకాల భవనాలను గుర్తించినట్టు కమిటీ వెల్లడించింది. ఆంధ్రాయూనివర్శిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, ఓపెన్‌ వర్శీటీ బ్లాకులు, సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ భవనాలు, మిలీనియం ఎ-టవర్‌, మిలీయనం బి- టవర్‌.. రుషికొండలోని టూరిజం రిసార్టులను గుర్తించామని కమిటీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com