ఒమన్‌లో పొగమంచు, వర్షపాతం

- November 04, 2023 , by Maagulf
ఒమన్‌లో పొగమంచు, వర్షపాతం

మస్కట్: సౌత్ అల్ షర్కియా, అల్ వుస్తా, ధోఫర్ మరియు అల్ దహిరా గవర్నరేట్‌లలో శనివారం అర్థరాత్రి, ఆదివారం తెల్లవారుజామున పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ జనరల్ డైరెక్టరేట్ పేర్కొంది. నేషనల్ మల్టీ-హాజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ తాజా వాతావరణ అప్‌డేట్‌ ప్రకారం.. నవంబర్ 5 నుండి నవంబర్ 9 వరకు ఒమన్ సుల్తానేట్‌ను ఎగువన ఏర్పడ్డ వాయు ద్రోణి ప్రభావితం చేసే అవకాశం ఉంది. "ముసందమ్, అల్ బురైమి, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా, అల్ దహిరా, మస్కట్, అల్ దఖిలియా, నార్త్ అల్ షర్కియా మరియు సౌత్ అల్ గవర్నరేట్‌లలో చురుకైన డౌన్‌డ్రాఫ్ట్ గాలులు, వడగళ్లు పడే అవకాశం ఉంది. అదే సమయంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. షార్కియా, అల్ హజర్ పర్వతాలు, పరిసర ప్రాంతాలు.. ఒమన్ సముద్ర తీర ప్రాంతాలపై భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ”అని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com