బిగ్‌బాస్‌లో ‘జపాన్’.! సందడి మామూలుగా వుండదు.!

- November 04, 2023 , by Maagulf
బిగ్‌బాస్‌లో ‘జపాన్’.! సందడి మామూలుగా వుండదు.!

బుల్లితెరపై బిగ్‌బాస్ గేమ్ షోకి వారం వారం గెస్ట్‌లు రావడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈ సాంప్రదాయం కారణంగా అటు బిగ్‌బాస్ షోకి అందం అద్దడంతో పాటూ, గెస్ట్‌లుగా వచ్చిన ఆయా సెలబ్రిటీల తాజా సినిమాలకు సంబంధించిన ప్రమోషన్‌ కూడా అవుతుంది.
అలా గతంలో విజయ్ దేవరకొండ (ఖుషి) సినిమా, సిద్దార్ధ్ (చిన్న) సినిమాతోనూ బిగ్‌ హౌస్ హౌస్‌లో సందడి చేశారు. ఇప్పడు కార్తీ వంతు వచ్చింది. ఈ దీపావళికి కార్తి ‘జపాన్ - మేడ్ ఇన్ ఇండియా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేయనున్నాడనీ తెలుస్తోంది. దానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోందట.
అన్నట్లు కార్తీ, నాగార్జున మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘ఊపిరి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కార్తీ తెలుగులో స్ట్రెయిట్‌గా నటించిన సినిమా ఇది. అటు నాగార్జునకీ, ఇటు కార్తీకీ తెలుగులో ఎవ్వర్ గ్రీన్ మూవీ ‘ఊపిరి’ అని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
ఆ స్నేహంతోనే నాగార్జునతో కలిసి బిగ్‌బాస్ స్టేజ్‌పై కార్తీ సందడి చేయబోతున్నాడట. ఈ ఎపిసోడ్ బిగ్‌బాస్ ఈ సీజన్‌కి హైలెట్ కానుందనీ తెలుస్తోంది. డోంట్ మిస్ దిస్. జస్ట్ వాచ్ ఇట్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com