ఫ్రీ టికెట్‌తో 20 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న ప్రవాసుడు..
- November 04, 2023
అబుధాబి: అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. అలాంటి అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు కూడా. దానిలో భాగంగా క్రమం తప్పకుండా లాటరీలు కొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కసారి అదృష్టం వరిస్తే రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది. ఇదిగో ఈ ప్రవాసుడి విషయంలో అదే జరిగింది. ఫ్రీగా వచ్చిన లాటరీ టికెట్‌తో అబుధాబి బిగ్ టికెట్ ర్యాఫిల్ డ్రాలో ఏకంగా 20 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నాడు. సిరియాకు చెందిన అజ్మీ మతానియస్ హౌరానీ కి ఇలా అదృష్టం వరించింది.
అల్ ఐన్ లోని గార్డెన్ సిటీలో నివాసం ఉండే అజ్మీ మతానియస్.. ఇటీవల బిగ్ టికెట్ ర్యాఫిల్ వారు ప్రకటించిన '2+1' ఆఫర్లో భాగంగా అక్టోబర్ 24న రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఈ ఆఫర్లో భాగంగా అతనికి ఒక టికెట్ ఉచితంగా వచ్చింది. అలా ఫ్రీగా వచ్చిన లాటరీ టికెట్‌కే మనోడి తాజాగా జాక్‌పాట్ తగిలింది. అబుధాబిలో తాజాగా నిర్వహించిన సీరిస్ నంబర్ 257 డ్రాలో అజ్మీ మతానియస్కు ఆఫర్లో భాగంగా ఫ్రీగా వచ్చిన లాటరీ టికెట్ నంబర్ 175573కు ఏకంగా 20 మిలియన్ దిర్హమ్స్ తగిలాయి. ఇలా ఫ్రీగా వచ్చిన టికెట్ అతణ్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసిందన్నమాట. అయితే, విజేతగా నిలిచిన విషయం అజ్మీ మతానియస్కు తెలియజేయాలని నిర్వాహకుల అతడు ఇచ్చిన రెండు మొబైల్ నంబర్లకు కాంటాక్ట్ చేశారు. కానీ, ఆ రెండు నెంబర్లు పనిచేయడం లేదట. దాంతో వేరే మార్గాల్లో అతడిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని రాఫెల్ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్‌కోచ్‌లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









