తెలుగు భాష, తెలుగు చిత్ర కళపై నాట్స్ వెబినార్
- November 05, 2023
అమెరికా: భాషే రమ్యం .. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. తెలుగు భాష పరిరక్షణ కోసం తెలుగు లలిత కళా వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల ఆన్‌లైన్ వేదికగా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు భాష, చిత్ర కళా వైభవంపై వెబినార్ నిర్వహించింది. ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు డాక్టర్ కొండపల్లి నీహారిణి ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలుగు భాషా వైభవాన్ని, తెలుగు మాధుర్యాన్ని ఆమె తెలుగు సాహిత్యం నుంచి చక్కగా వివరించారు. ప్రముఖ చిత్ర కళాకారుడు, చిత్ర కళా తపస్విగా పేరుగాంచిన కొండపల్లి శేషగిరిరావు గీసిన చిత్రాలను ఆమె ఈ సందర్భంగా చూపించి ఆ చిత్రాల అంతరార్థాన్ని కూడా నీహారిణి వివరించారు. ఆనాడు కొండపల్లి శేషగిరిరావు గారి చిత్రాలకు ఎంతటి ఆదరణ ఉండేది అనేది వివరించారు. ఈనాడు అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు నిలువెత్తు చిత్రాన్ని కూడా కొండపల్లి శేషగిరిరావు చిత్రించిందేనని నీహారిణి తెలిపారు. బొమ్మల్లో హావభావాలను స్పష్టంగా చిత్రీకరించి అవి చూడగానే మనస్సును ఆకట్టుకునేలా.. మనకు కొత్త విషయాలు చెప్పేలా కొండపల్లి శేషగిరి రావు బొమ్మలు ఉండేవని ఆమె వాటిని చూపిస్తూ వివరించారు. ఈ కార్యక్రమానికి శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ, గిరి కంభంమెట్టు, మురళీకృష్ణ మేడిచెర్ల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు నాట్స్ చేస్తున్న కృషిని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి వివరించారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నాట్స్ నాయకులను నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి అభినందించారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







