యూఏఈని ముంచెత్తిన వర్షం
- November 05, 2023
యూఏఈ: యూఏఈని భారీ వర్షం ముంచెత్తింది. శనివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో వాహన డ్రైవర్లు ఇబ్బందులు పడ్డారు. దుబాయ్, అబుదాబి మరియు షార్జాలోని రోడ్లపై భారీ వర్షం కురిసింది. వర్షాలకు అన్ని ఇతర ఎమిరేట్స్ ప్రభావితమైనట్లు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. ఈ మేరకు యూఏఈకి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దేశంలోని చాలా ప్రాంతాలను అలర్ట్లు ఉన్నందునా ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులను చూపించే వీడియోలను వాతావరణ కేంద్రం తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ముంపునకు గురైన లోయల్లోకి ప్రవేశించడం, ప్రమాద స్థాయితో సంబంధం లేకుండా 2,000 దిర్హామ్ జరిమానా, 23 బ్లాక్ పాయింట్లు, 60-రోజుల వాహన జప్తు విధించబడుతుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి