యూఏఈని ముంచెత్తిన వర్షం

- November 05, 2023 , by Maagulf
యూఏఈని ముంచెత్తిన వర్షం

యూఏఈ: యూఏఈని భారీ వర్షం ముంచెత్తింది. శనివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో వాహన డ్రైవర్లు ఇబ్బందులు పడ్డారు. దుబాయ్, అబుదాబి మరియు షార్జాలోని రోడ్లపై భారీ వర్షం కురిసింది. వర్షాలకు అన్ని ఇతర ఎమిరేట్స్ ప్రభావితమైనట్లు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. ఈ మేరకు యూఏఈకి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.  దేశంలోని చాలా ప్రాంతాలను అలర్ట్‌లు ఉన్నందునా ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులను చూపించే వీడియోలను వాతావరణ కేంద్రం తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ముంపునకు గురైన లోయల్లోకి ప్రవేశించడం,  ప్రమాద స్థాయితో సంబంధం లేకుండా 2,000 దిర్హామ్ జరిమానా, 23 బ్లాక్ పాయింట్లు, 60-రోజుల వాహన జప్తు విధించబడుతుందని అధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com