'స్పైస్‌జెట్‌' వారి ఉచిత నీటి సరఫరా

- May 24, 2016 , by Maagulf
'స్పైస్‌జెట్‌' వారి ఉచిత నీటి సరఫరా

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ప్రజలకు తన సేవలను ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మహారాష్ట్రలోని 11 నీటి ఎద్దడి గ్రామాలను ఆదుకోనుంది. ఓ ఎన్‌జీవోతో కలిసి మరఠ్వాడా ప్రాంతంలోని లాతూర్‌ జిల్లాలోని 11 ప్రాంతాలకు ఉచితంగా నీటిని సరఫరా చేయనుంది. 71,500 లీటర్లు నీటిని ప్రజలకు అందించనున్నట్లు విమానయాన సంస్థ అధికారులు వెల్లడించారు. స్పైస్‌జెట్‌ ప్రత్యేక నీటి ట్యాంకర్ల ద్వారా జూన్‌ 23 వరకు నీటిని సరఫరా చేస్తుంది.

మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కరవు ప్రాంతాలుగా 29వేల గ్రామాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మరఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com