కెనడాలోని కూచిపూడి నృత్యాలయం ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకలు...

- November 07, 2023 , by Maagulf
కెనడాలోని కూచిపూడి నృత్యాలయం ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకలు...

టొరంటో: టొరంటో, కెనడా లోని కూచిపూడి నృత్యాలయం ఫౌండేషన్ వార్షికోత్సవ సందర్భంగా, ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, సంస్థ 'నృత్య నీరాజనం' కార్యక్రమాన్ని ఈస్టుడేల్ సి వి ఐ  థియేటర్ లో ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ముందుగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో రమేష్ వేమూరి మరియు  సుధ వేమూరి పాల్గొన్నారు. తదుపరి మాధవి ముండ్లూరు, ప్రియ కొమండూరి,  మాధవి చిలువేరు,  దేవి కలిదిండి, కుమారి ప్రవల్లిక వేమూరి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అపర్ణ రాంభట్ల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆశ్రీత పొన్నపల్లి కెనడా జాతీయ గీతం, మా తెలుగు తల్లి కి పాడిన పాటలతో కార్యక్రమం ప్రారంభమయింది. 

ఈ సందర్భంగా 40 మందికి పైగా నృత్యాలయం విద్యార్థినులు ఈ కార్యక్రమంలో వివిధ అంశాలకు కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో 400 పైగా ఆహుతులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం రసవత్తరంగా సాగి వీక్షకులను ఆకట్టుకుంది. 

ఈ సందర్భంగా సిరివంశిక చిలువేరు, శ్రీనిధి కలిదిండి, హాసిని కొమండూరి ప్రదర్శనకు గ్రిఫిన్ కాలేజి, లండన్ వారు "నాట్య విలార్మణి" అవార్డులను ప్రదానం చేశారు. ఈ ముగ్గురు విద్యార్థినులు కూచిపూడి నృత్యాలయం సంస్థ నుండి "నృత్యశ్రీ" అవార్డులను కూడా అందుకున్నారు. సుశి నల్లయ్య, కమలిని, గ్రిఫిన్ కాలేజి, లండన్, నగేష్ కొండా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సుశీ నల్లయ్య, విద్యార్థినుల నాట్య ప్రదర్శన శిఖరాగ్రమాయమని ప్రశంసించారు. విద్యార్థినులు, వారి తల్లితండ్రులు, గురువు సుధా వేమూరి కృషి అభినందనీయం అన్నారు. తదుపరి నాట్య ప్రదర్శన చేసిన విద్యార్థినులందరికి 'గెట్ హోమ్ రియాల్టీ' తరపున రమేష్ గొల్లు మొమెంటోలు అందచేశారు. 

ఈ సందర్భంగా ఆషవా నగర మేయర్ ప్రతినిధి బ్రాడ్లీ మార్క్స్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి అభినందనలు తెలియచేసారు. అదే విధంగా Colin Carrie, ఆషవా నగర M.P. ప్రతినిధిగా విచ్చేసిన పాల్ కెల్లీ, కూచిపూడి నృత్యాలయం సంస్థకు ప్రశంసా పత్రాన్ని అందచేశారు. 

ఈ కార్యక్రమ నిర్వహణలో వెంకట్ చిలువేరు, రవి కొమండూరి, ఆనంద్ కలిదిండి, వరుణ్ కోటేశ్వర్, నరేష్ ముదునూరు, రఘు ప్రసాద్ వేమూరి మొదలగు వారు కోర్ టీంగా వ్యవహరించారు. 

ఈ కార్యక్రమానికి ప్రధానంగా ఆర్ధిక సహాయం అందచేసిన తెలుగు ఫుడ్స్ అధినేతలు, శ్రీధర్ ముండ్లూరు, దివ్య దొంతి, హోమ్ లైఫ్ రియాల్టీ అధినేత రామ్ జిన్నాల ను నృత్యాలయం సంస్థ వారు సన్మానించారు. ఈ కార్యకమంలో కెనడా తెలుగు సంస్థలు డీటీసీ, సిఏసి, ఓటీయఫ్, డిటీఏ, టాక, తదితర ప్రతినిధులు పాల్గొని ప్రశంసించారు. 

ఈ సందర్భంగా, కూచిపూడి దేవాలయం ధర్మకర్త ఏలేశ్వరపు హనుమంత రావు, సిద్ధేంద్ర కళాక్షేత్రం ప్రిన్సిపాల్ రామలింగ శాస్త్రి , కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యాం ఆశీస్సులు అందచేశారు. 

చివరిగా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలు అందించిన వారికి, ఆర్ధిక సహాయం అందించిన వివిధ సంస్థల వారికి, విందు భోజనం అందించిన వారికి, న్యాయనిర్ణేతలకు, విద్యార్థినుల తల్లితండ్రులకు, వ్యాఖ్యతకు, ముఖ్యంగా వీక్షకులకు శ్రవణ్ వేమూరి వందన సమర్పణ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com