వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే

- September 15, 2025 , by Maagulf
వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే

న్యూ ఢిల్లీ: వక్ఫ్ చట్టం 2025లో చేసిన సవరణలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, రికార్డుల సంరక్షణ, కొత్త నిబంధనల అమలు వంటి అంశాలపై పలువురు పిటిషనర్లు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసులను సోమవారం ధర్మాసనం విచారించింది. చీఫ్ జస్టిస్ జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని బెంచ్‌ ఈ వ్యవహారంలో మధ్యంతర తీర్పు ఇచ్చింది.

తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నది ఏమిటంటే – వక్ఫ్ చట్టం మొత్తాన్ని తక్షణమే నిలిపివేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి చట్టం సమగ్రంగా అమల్లోనే కొనసాగుతుంది. అయితే ఇటీవల సవరణలలో చేర్చిన కొన్ని నిబంధనలు వివాదాస్పదంగా ఉన్నాయని, వాటిని పూర్తిగా అమలు చేసే ముందు లోతైన విచారణ అవసరమని పేర్కొంది. ఈ కారణంగా కొన్ని ప్రత్యేక నిబంధనలపై మాత్రమే తాత్కాలికంగా స్టే విధించింది.

కనీసం ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్‌ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని కోర్టు నిలిపివేసింది.దీర్ఘకాలంగా వక్ఫ్ కోసం ఉపయోగించిన ఆస్తులను, వాటిని వక్ఫ్‌గా ప్రకటించే నిబంధనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆస్తులను డీనోటిఫై (Denotify) చేయవద్దని కేంద్రాన్ని ఆదేశించింది. దీని వల్ల చాలా వివాదాలు తలెత్తుతాయని, ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన విధానం తీసుకురావాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com