'సచిన్' చిత్రంపై పెదవి విప్పిన ఏఆర్ రెహ్మన్
- May 24, 2016
క్రికెట్ మైదానంలో తన ఆటతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ బయోపిక్ 'సచిన్' చిత్రంపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మన్ పెదవి విప్పాడు. బాల్య దశ నుంచి క్రికెట్ దిగ్గజంగా తెందుల్కర్ ఎదిగిన క్రమాన్ని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం అని వివరించిన రెహ్మన్ ఇందులో క్రికెట్ అభిమానులు గతంలో సచిన్ జీవితం గురించి ఎన్నడూ వినని, చూడని అంశాలు కూడా ఉన్నాయని వెల్లడించాడు. 'క్రికెట్ దిగ్గజంగా చిత్రంలో సచిన్ ఎదిగిన క్రమానికి వినసొంపైన సంగీతాన్ని సమకూర్చాను. అందుకే ఈ సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఈ ఏడాది ఎక్కువ మంది వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్న చిత్రం ఇదేనేమో' అని రెహ్మన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ అందమైన చిత్రం ఇంకా తుది మెరుగులు దిద్దుకుంటోందన్నాడు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









