రష్మికకు ఈ కొత్త పబ్లిసిటీ అవసరమా బాస్.!
- November 07, 2023
రష్మిక అంటేనే నేషనల్ క్రష్. ఆమెకు ప్రత్యేకంగా పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరమే లేదు. తాజాగా రష్మికకు సంబంధించి ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘డీప్ ఫేక్’ అనే పేరుతో వైరల్ అవుతోన్న ఈ వీడియోకి సంబంధించి సెలబ్రిటీలు స్పందిస్తుండడమే ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏకంగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద వ్యక్తి ఈ వీడియో పట్ల స్పందించడం అవసరమా.? అనే చర్చ వినిపిస్తోంది.
సెలబ్రిటీల విషయంలో ఇలాంటి ఫేక్ వీడియోలు సర్వసాధారణం. గతంలో చాలా చాలా వీడియోలు త్రిష తదితర హీరోయిన్ల మీద వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు మాట్లాడుకుంటారు. మర్చిపోతారు. కానీ, రష్మిక విషయంలో ఈ సరికొత్త పబ్లిసిటీనే కాస్త చికాకు పెట్టిస్తోందన్న చర్చ కొందరు మేథావుల నుంచి వినిపిస్తోంది.
ప్రస్తుతం రష్మిక టాలీవుడ్‌తో పాటూ బాలీవుడ్‌లోనూ మంచి ఇమేజ్ దక్కించుకుంటోంది. దాంతో, అక్కడా, ఇక్కడా కూడా పలువురు సెలబ్రిటీలు ఈ వీడియో విషయంలో రష్మికకు మద్దతు పలుకుతున్నారు. ఈ వీడియో తనను బాగా వేధించిందని రష్మిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. పలువురు సెలబ్రిటీల మద్దతు తనకు ఒకింత ధైర్యాన్నిస్తోందనీ.. కాలేజీ రోజుల్లోనో లేదంటే తాను చదువుకునే రోజుల్లోనే ఇలాంటి వీడియోలు వస్తే తన పరిస్థితి మరోలా వుండేదని రష్మిక చెబుతోంది.
తాజా వార్తలు
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి