హిందీలో ‘బేబీ’ రీమేక్.!
- November 08, 2023
ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా తెరకెక్కిన చిత్రం ‘బేబీ’ ఇటీవల చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
యూట్యూబర్‌గా పాపులారిటీ వున్న వైష్ణవీ చైతన్యకు ఈ సినిమాతో మంచి డెబ్యూ దొరికింది. నార్మల్ లవ్ స్టోరీనే అయినా తెరకెక్కించిన విధానం, యూత్‌ని బాగా కనెక్ట్ చేసింది. దాంతో, ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండింది.
ఏదైనా ఒక ఫార్ములా హిట్ అయ్యిందంటే చాలు.. అదే ఫార్మేట్లో కొన్నాళ్ల పాటు సినిమాలు వస్తుంటాయ్. లక్కు బాగుంటే సక్సెస్ అవుతుంటాయ్ కూడా. అదే స్ర్టేటజీతో మరో నాలుగు స్టోరీలు సాయి రాజేష్ సిద్ధం చేసి వుంచారట.
అదలా వుంటే, ‘బేబీ’ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్‌కీ పాకినట్లుంది. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆ విషయాన్ని స్పష్టం చేశారు.
‘కోట బొమ్మాళి పీఎస్’ నిర్మాత అయిన ఎస్.కె.ఎన్ ఈ సినిమాని హిందీలో నిర్మిస్తున్నట్లు అల్లు అరవింద్ స్పష్టం చేశారు. అయితే డైరెక్టర్, నటీనటులు ఎవరన్న వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







