మొన్న విఘ్నేష్ నయన్ ఇప్పుడు వరుణ్ లావణ్య.!
- November 08, 2023
సెలబ్రిటీల పెళ్లి వేడుకలంటే వాటికి వుండే క్రేజ్ వేరే లెవల్. ఈ మధ్య కాలంలో నయన తార, విఘ్నేష్ శివన్ పెళ్లి వేడుక గురించి బాగా మాట్లాడుకున్నారు. వారి వివాహ వేడుకకు సంబంధించి ఒక్క ఫోటో కానీ, వీడియో కానీ రిలీజ్ కాకుండా జాగ్రత్త పడి.. దాన్నంతటినీ అఫీషియల్‌గా ఓటీటీ టెలికాస్ట్ చేస్తారనీ.. అందుకోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఆ హక్కుల్ని అధిక మొత్తానికి కొనుగోలు చేసిందనీ అప్పట్లో ప్రచారం గట్టిగా జరిగింది.
ఇదిగో అదిగో అన్నారు కానీ, ఆ ప్రచారం నిజం కాలేదు. అప్పుడప్పుడూ కొన్ని కొన్ని ఫోటోల రిలీజ్ చేసి సరిపెట్టేశారంతే. ఇప్పుడు మళ్లీ ఇలాంటి చర్చే నడుస్తోంది. మెగా రాకుమారుడు వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
అత్యంత తక్కువ మంది సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులూ, సన్నిహితుల మధ్య ఈ వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకనంతటినీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయబోతున్నారనీ, అందుకోసం దాదాపు 8 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ రైట్స్ తీసుకుందనీ ప్రచారం జరుగుతోంది.
అయితే, తూచ్.! అదంతా వుత్తదే అంటున్నారు కొంతమంది. ఇప్పటికే కొన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ అయ్యాయ్. కానీ, వేడుక మొత్తాన్నీ నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేయనుందనీ, వెరీ లేటెస్ట్‌గా జరిగిన రిసెప్షన్ హంగామా కూడా జత చేసి ఈ పెళ్లి వేడుక వీడియోని ప్రసారం చేయబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయ్. చూడాలి మరి, ఇందులో అయినా ఎంత నిజముందో.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







