ఉప్పుతో ముప్పు వారికే కాదు సుమా.!

- November 08, 2023 , by Maagulf
ఉప్పుతో ముప్పు వారికే కాదు సుమా.!

బీపీ లేదా అధిక రక్తపోటు వున్నవాళ్లు ఉప్పు అధికంగా వాడరాదని అంటుంటారు. అవును నిజమే. అయితే, బీపీ వున్నవాళ్లు మాత్రమే ఉప్పు అధికంగా వాడకూడదా.? అంటే కానే కాదు. పరిమితి లేకుండా ఉప్పు వాడకం అందరికీ ముప్పే అంటున్నారు.

ముఖ్యంగా డయాబెటిస్ వున్నవాళ్లు నాకు బీపీ లేదుగా నేను ఉప్పు వాడొచ్చు. షుగర్ వుంటే స్వీట్ తినకూడదు కానీ, ఉప్పుతో ఏం సమస్య.? అని ప్రశ్నిస్తుంటారు. కానీ, డయాబెటిస్ వున్నవాళ్లకీ ఉప్పు ప్రాణాంతకమని నిపుణులు చెబుతున్నారు.

మనిషి శరీరంలో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పని చేయాలంటే పాంక్రియాస్ విడుదల చేసే హార్మోన్ ఇన్సులిస్ స్థాయి సక్రమంగా వుండాలి. ఇన్సులిన్ శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రణలో వుంచుతుంది. ఉప్పు అధికంగా తినడం వల్ల పాంక్రియాస్, ఇన్సులిన్‌ని రిలీజ్ చేయడంలో బలహీనపడుతుంది.

తద్వారా శరీరంలో చక్కెర స్థాయులు అధికమవుతాయ్. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో అధిక మూత్ర విసర్జన జరుగుతుంది. ఈ కారణంగా కూడా ఇన్సులిన్ శక్తి బలహీనపడుతుంది. అందుకే ఉప్పుతో ముప్పు కేవలం బీపీ వున్నవారికే కాదు డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు కాస్త ఎక్కువ ప్రమాదం. బీపీలూ, షుగర్లు లేని వాళ్లు కూడా ఉప్పు విషయంలో తస్మాత్ జాగ్రత్త అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com