సూపర్ సీట్ సెల్: Dh1 కే మనీలాకు!

- November 09, 2023 , by Maagulf
సూపర్ సీట్ సెల్: Dh1 కే మనీలాకు!

దుబాయ్: యూఏఈ లోని ఫిలిపినో నివాసితులు వచ్చే ఏడాది స్వదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. ఇప్పుడు విమానాన్ని బుక్ చేసుకునే సమయం వచ్చింది. బడ్జెట్ క్యారియర్ సెబు పసిఫిక్ (Cebu Pacific )బుధవారం నాడు Dh1కి వన్-వే ట్రిప్పులను అందిస్తూ సూపర్ సీట్ల విక్రయాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ 1 నుండి అక్టోబర్ 31, 2024 వరకు షెడ్యూల్ చేయబడిన వన్-వే దుబాయ్-మనీలా విమానాలకు Dh1 బేస్ ఫేర్ వర్తిస్తుంది. అయితే, ప్రత్యేక ధరను పొందడానికి ప్రయాణికులు బుధవారం (నవంబర్ 8) నుండి నవంబర్ 14 వరకు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఎయిర్‌లైన్ తెలిపింది. నవంబరు 11న సెబు పసిఫిక్ పెద్ద "పిసో ఫేర్" ప్రచారంలో భాగంగా అల్ట్రా-చౌక విమాన సీట్లు అందుబాటులోకి వస్తాయి. బోరాకే ద్వీపం, బోహోల్ వంటి ఇతర స్థానిక గమ్యస్థానాలకు వెళ్లాలనుకునే ఫిలిపినోలు కేవలం Php1 (7 fils)కి మాత్రమే సీటు పొందవచ్చు. బడ్జెట్ క్యారియర్ సెబు ప్రస్తుతం 35 ఫిలిప్పీన్స్, 25 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com