గాజా వివాదం పై చర్చించేందుకు అరబ్- ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాలు
- November 09, 2023
రియాద్: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై చర్చించేందుకు సౌదీ అరేబియా రాబోయే రోజుల్లో అరబ్- ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించనుందని సౌదీ అరేబియా పెట్టుబడి మంత్రి ఖలీద్ అల్ ఫాలిహ్ బుధవారం తెలిపారు. సింగపూర్‌లోని బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాబోయే కొద్ది రోజుల్లో రియాద్‌లో అత్యవసర అరబ్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమ్మిట్ కోసం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదివారం సౌదీ అరేబియాకు వెళ్లనున్నారు. మార్చిలో చైనా మధ్యవర్తిత్వ ఒప్పందం ప్రకారం టెహ్రాన్ - రియాద్ సంవత్సరాల శత్రుత్వాన్ని ముగించిన తర్వాత ఇరాన్ దేశాధినేత మొదటి పర్యటన ఇది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







