పార్కింగ్ స్థలంలో Dh125,000 చోరీ..3 గంటల్లో ఛేదించిన పోలీసులు
- November 09, 2023
యూఏఈ: చోరీకి గురైన మూడు గంటల తర్వాత అజ్మాన్ పోలీసులు 125,000 దిర్హామ్‌లతో కూడిన బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు తన పార్క్ చేసిన కారు ముందు బ్యాగ్‌ను మర్చిపోయాడు. బ్యాగ్‌ని గుర్తించిన దొంగ దానితో పరారయ్యాడు. పని నుండి తిరిగి వచ్చిన తర్వాత రషీదియాలోని తన నివాస భవనం అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో తన కారును పార్క్ చేసినట్లు భారతీయ ఫిర్యాదుదారు పోలీసులకు చెప్పాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసు బృందం నిందితుడిని గుర్తించి, గంటల వ్యవధిలో అతని నివాస స్థలం నుండి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుంది. బ్యాగ్‌ని గుర్తించిన తర్వాత నిందితుడు ఆ బ్యాగ్‌తో పారిపోయినట్లు అంగీకరించినట్లు సమాచారం. అనంతరం ఫిర్యాదుదారుడికి నగదు ఉన్న బ్యాగును అందజేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







