హిందీ, తెలుగు భాషలు రెండు కళ్ళు: యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
- November 09, 2023
విశాఖపట్నం: జాతీయ భాష హిందీ, మాతృభాష తెలుగు ప్రాశస్త్యాన్ని నలుదిశలా చాటిచెప్పేందుకు తన వంతుగా నిరంతరం కృషి చేస్తానని పార్లమెంట్ మాజీ సభ్యులు, సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. గురువారం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ హిందీ భవన్ లో జర్నలిస్ట్ సంఘ నాయకులు యార్లగడ్డ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ హిందీ, తెలుగు భాషలు తనకు రెండు కళ్ళు లాంటివని, వాటి గొప్పతనాన్ని తెలియజెప్పే సాహితీ ప్రక్రియను కొనసాగిస్తానన్నారు. యార్లగడ్డ ఈ నెల 24న జరగనున్న తన 70 వసంతాల ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆహ్వానపత్రికను సీనియర్ పాత్రికేయులు నిమ్మరాజు, చలపతిరావు, జర్నలిస్ట్ డి. హరనాథ్ కు అందజేశారు. అనంతరం వీరు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను సత్కరించారు.
తాజా వార్తలు
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్‌కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్









