గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి పై ఇజ్రాయెల్ దాడులు.. 13 మంది మృతి
- November 11, 2023
యూఏఈ: సెంట్రల్ గాజా సిటీలో అతిపెద్ద ఆసుపత్రి కాంపౌండ్ వద్ద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 13 మంది మరణించారని గాజా స్ట్రిప్‌లోని హమాస్ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. గాజా నగరంలోని కొన్ని ఇతర ఆసుపత్రులను ఇజ్రాయెల్ ట్యాంకులు చుట్టుముట్టాయని, గత కొన్ని వారాలుగా వందల వేల మంది ప్రజలు గాజా దక్షిణ ప్రాంతానికి తరలి వెళుతున్నారు. మరోవైపు గురువారం ఆసుపత్రి సమీపంలో భారీ పోరాటం జరిగిందని, ఇందులో డజన్ల కొద్దీ ఉగ్రవాదులు చనిపోయారని ఇజ్రాయెల్ వెల్లడించింది. హమాస్ ఆసుపత్రులను రహస్య స్థావరాలుగా ఉపయోగించుకుందని ఆరోపించింది. ఇదిలా ఉండగా కరెంటు, నీరు, ఆహారం లేకుండా తాము విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని గాజా ఆసుపత్రుల డైరెక్టర్ జనరల్ మహ్మద్ జాకౌట్ తెలిపారు. గాజా స్ట్రిప్‌లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 10,800 మంది కంటే ఎక్కువ మంది ఇప్పటివరకు మరణించారు.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్‌కు గుడ్‌బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









