ఎమిరాటీ ప్రతిపాదనను అంగీకరించిన యునెస్కో..
- November 11, 2023
యూఏఈ: యునెస్కో ఎమిరాటీ ప్రతిపాదనను ఆమోదించినట్లు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 29ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్రోగ్రామింగ్‌గా గుర్తిస్తామని, మార్చి 19ని ఇంటర్నేషనల్ డే ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్‌గా గుర్తిస్తామని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు. షేక్ మొహమ్మద్ తన ట్వీట్‌లో "యూఏఈ కోసం ఒక కొత్త ప్రపంచ చొరవలో... యునెస్కో ఈ రోజు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీని (మేము దుబాయ్ ఇంటర్నెట్ సిటీని ప్రారంభించిన రోజు) అంతర్జాతీయ ప్రోగ్రామింగ్ డేగా చేయడానికి ఎమిరాటీ ప్రతిపాదనను ఆమోదించింది. మార్చి 19ని ఇంటర్నేషనల్ డే ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్‌గా జరుపనున్నారు." అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్‌కు గుడ్‌బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









