కువైట్ లో జాతీయ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం

- November 11, 2023 , by Maagulf
కువైట్ లో జాతీయ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం

కువైట్: జాతీయ ఆరోగ్య వ్యవస్థను కువైట్ బలోపేతం చేయనుంది. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, 2024 నాటికి కొత్తగా కొనుగోలు చేసిన 80 అంబులెన్స్‌లు సేవలో ఉంటాయని ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి తెలిపారు. అల్-ముత్లా ప్రాంతంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి ప్రసంగించారు. ఈ కేంద్రం ఆరు అంబులెన్స్‌లు,  ఆరుగురు టెక్నీషియన్ల సామర్థ్యంతో పనిచేస్తుందన్నారు. అల్-జహ్రా మెడికల్ ఏరియా మరియు కొత్త జహ్రా ఆసుపత్రికి మద్దతుగా 24 గంటలూ పని చేస్తుందని, నాలుగు కొత్త వైద్య కేంద్రాలను ప్రారంభించబోతున్నామని డాక్టర్ అల్-అవధి వివరించారు.  దాదాపు 28,000 రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్న వైద్యరంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నామని మంత్రి చెప్పారు.

ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ అహ్మద్ అల్-షట్టి మాట్లాడుతూ.. అభివృద్ధి విస్తరణ ప్రణాళికలో భాగంగా ఒక సంవత్సరంలోనే తొమ్మిది అత్యవసర ప్రతిస్పందన కేంద్రాలను ప్రారంభించామని, మొత్తం 86 కేంద్రాలకు చేరుకుందని పేర్కొన్నారు. వేగవంతమైన ప్రతిస్పందనను అందించడానికి, అల్-అబ్దాలీ రహదారికి కూడా కేంద్రం సేవలను విస్తరిస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com